anitha sorry

హోంమంత్రి నోట క్షేమపణలు

నిండు అసెంబ్లీ లో ఏపీ హోంమంత్రి అనిత క్షేమపణలు కోరింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి , వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాటకు మాట , విమర్శకు ప్రతివిమర్శ ఇలా గందగోళంగా నడుస్తూ వస్తుంది.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మండలి సభలో రాష్ట్ర హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితరాజకీయాలు మాట్లాడుతున్నారని, శాంతి భద్రతలపై సూటిగా సమాధానం చెప్పడం లేదని , రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని బొత్స అన్నారు. రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా హోంమంత్రి అనిత తాము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో తాము సభ నుంచి వాకౌట్ అవుతామని హెచ్చరించారు.

దీంతో బొత్స వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్సకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లు చేసిన దౌర్భాగ్యాలు, వాస్తవాలు సభలో వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ముంటే బొత్స నిల్చోవాలని, ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ఆమె వ్యాఖ్యానించారు. సభలో అనిత చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై శాసనమండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దమ్ము, ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు హోంమంత్రి అనిత వెంటనే క్షమించాలని వేడుకోవడంతో చైర్మన్ శాంతించారు.

Related Posts
ట్రంప్ టీమ్ లోకి శ్రీరామ్ కృష్ణన్
sriram krishnan

జనవరి మాసంలో అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన మంత్రివర్గాన్ని విస్తరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో ఇండియన్ అమెరికన్ కు చోటు దక్కింది. Read more

ఫిబ్రవరి 4వ తేదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం !
CM Revanth Reddy's key decision on February 4!

ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజికన్యాయ దినోత్సవం హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ Read more

US Green Card: గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం కాదు: జేడీ వాన్స్
గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం కాదు: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల గ్రీన్ కార్డు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు ఉండదని Read more

Sunita Williams:సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే?
Sunita Williams సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే

Sunita Williams:సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే? అంతరిక్షయానం ముగించుకుని భూమికి చేరిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్‌లను వైట్ హౌస్‌కు ఎప్పుడు ఆహ్వానిస్తారనే Read more