హీరోయిన్లు చూపులు మాత్రం బాలీవుడ్‌పై

హీరోయిన్లు చూపులు మాత్రం బాలీవుడ్‌పై

తెలుగు చిత్ర పరిశ్రమలో నచ్చుకున్నంత క్రేజ్ ఉంది.ఇక్కడ నిర్మాతలు హీరోయిన్లను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు, దర్శకులు ప్రత్యేక పాత్రలు రాసి పిలుస్తారు. కానీ, మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్‌పైనే నిలుస్తున్నాయి. నార్త్ ఇండియా మన సినిమాలను కొనియాడుతుంటే,మన హీరోయిన్లు మాత్రం హిందీ సినిమా వైపే ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఆచరణం అనేవారు.కానీ ఇప్పటి పరిస్థితుల్లో అక్కడ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేదు. మన సినిమాలే అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.అయినా మన హీరోయిన్లు బాలీవుడ్ బాట పడటానికి కారణం ఒకటే – రెమ్యునరేషన్ ఇక్కడ హీరోయిన్లకు ఇస్తున్న పారితోషికంతో పోలిస్తే,బాలీవుడ్‌లో రెమ్యునరేషన్ రెట్టింపు. ఉదాహరణకు రష్మిక మందన్నను తీసుకుంటే, తెలుగులో ఎంత పెద్ద సినిమా చేసినా 2 కోట్లకంటే ఎక్కువ రావడం అరుదు.

Advertisements
telugu heroines
telugu heroines

అదే బాలీవుడ్‌లో ఒక ప్రాజెక్ట్‌కే 5-7 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తారట.అంతేకాకుండా, జాతీయస్థాయిలో పాపులారిటీ కూడా ఫ్రీగా వస్తుంది.కీర్తి సురేష్ కూడా బాలీవుడ్‌లో “బేబీ జాన్” సినిమాలో పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది.తెలుగులో ఆమెకి సాధారణంగా 2 కోట్లు మాత్రమే ఇస్తే, బాలీవుడ్‌లో ఆమె రెమ్యునరేషన్ డబుల్ అయిందట. అలాగే,సమంత వెబ్ సిరీస్‌ల ద్వారా నార్త్ ఇండియాలో మంచి ఆదరణ పొందుతున్నారు. ఇటీవల సిటాడెల్ సిరీస్ కోసం సమంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ సిరీస్ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.

మధ్యస్థాయిలో ఉన్న హీరోయిన్లు కూడా బాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్నారు. రెజీనా కసాండ్రా సన్నీ డియోల్ జాట్ సినిమాలో నటిస్తుండగా, రాశీ ఖన్నా వరుస సినిమాలతో అక్కడ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ మంచి రెమ్యునరేషన్‌తో బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్నారు. తెలుగు పరిశ్రమ ఎంతో పెద్దదైనా, బాలీవుడ్‌లో రెమ్యునరేషన్, జాతీయ స్థాయి గుర్తింపు మన హీరోయిన్లను ఆ కిందికి ఆకర్షిస్తోంది. ఇది తెలుగు ప్రేక్షకులకు నిరాశ కలిగించినా, హీరోయిన్ల భవిష్యత్తు దృష్ట్యా వారి నిర్ణయం సమర్థనీయం.

Related Posts
హెబ్బా వయ్యారాలు మాములుగా లేవుగా..
heeba patel

అందాల తార హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ Read more

సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్..వెంటిలేటర్‌పై చికిత్స
Singer Kalpana commits suicide attempt...treated on ventilator

హైదరాబాద్‌: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. బలవన్మరణానికి పాలు పడాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది? Read more

(Suriya) ఆసక్తికర కామెంట్స్‌ చేశారుటా లీవుడ్‌ హీరోలపై;
surya

ఇంటర్నెట్ డెస్క్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా టాలీవుడ్ అగ్రహీరోలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కంగువా నవంబర్ 14న విడుదల Read more

ఎమ్.ఎస్ ధోని సినిమా వదిలేసినా రకుల్ ప్రీత్
ఎమ్.ఎస్ ధోని సినిమా వదిలేసినా రకుల్ ప్రీత్

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, తన అందంతో మరియు నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ గత కొన్నేళ్లుగా తెలుగులో మరే Read more

Advertisements
×