hinachal

హిమాచల్‌ప్రదేశ్ కు ఆరెంజ్‌ అలర్ట్‌

చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. దీనితో ఆరెంజ్‌ అలర్ట్‌ చేసారు. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.
పలు రోడ్లు మూసివేత

Advertisements

హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్‌, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి. 173 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
డెహ్రాడూన్‌లో దట్టంగా మంచు
ఇక ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో త్యుని-చక్రతా-ముస్సోరీ జాతీయ రహదారి, ధరణాధర్-కోటి కనసర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి.

శ్రీనగర్‌లో మైనస్‌ 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అవసమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Posts
త్వరలో ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటన?
election commission of india

త్వరలో ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నది.వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో Read more

Bengaluru Case: మహిళలపై దాడి కేసులో కేరళలో నిందితుడు అరెస్ట్
మహిళలపై దాడి కేసులో కేరళలో నిందితుడు అరెస్ట్

బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ వద్ద ఒక సందులో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న Read more

AmitShah: నక్సలిజాన్ని 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్‌ షా
నక్సలిజాన్ని 2026 నాటికి పూర్తిగా అంతం చేస్తాం : అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల నక్సలిజాన్ని 2026 నాటికి దేశంలో పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నక్సల్స్‌ ప్రభావిత Read more

ఢిల్లీ సీఎం ఎవరు?.. వినిపిస్తున్న పేర్లు ఇవే..?
Who is the CM of Delhi?.. These are the names being heard..? .jpg

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ Read more

×