cm revanth reddy district tour

హాస్టళ్లలో భోజనంపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

హాస్టళ్లలో భోజన వసతులపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో
నేడు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల బాగోగుల పట్ల కీలక నిర్ణయాలు తెలిపారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో నాసిరకమైన భోజనం లేదా క్వాలిటీ లేని సరఫరా చేయడం వంటివి చేస్తే జైలుకు పంపిస్తా అని హెచ్చరించారు. ఈ మధ్య ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్న ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, ఎమ్మెల్యేలు, మంత్రులు తింటున్న సన్న బియ్యం గురుకుల విద్యార్థులకు కూడా అందించాలని ఆయన పేర్కొన్నారు.

విద్యా రంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు చేస్తూ.. తమ ప్రభుత్వం విద్యా బడ్జెట్‌ను పెంచిందని, గత పదేళ్లలో మూసివేయబడిన పాఠశాలలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులను వ్యసనాలకు దూరంగా ఉంచడానికి విద్యా పరిపాలనా విధానాలను చక్కదిద్దేందుకు విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని, పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, వారి భవిష్యత్తు పట్ల శ్రద్ధ చూపడం తమ ప్రభుత్వ సంకల్పం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజా ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయిందని ఇవాళ్టి నుంచే ప్రజా ఉత్సవాలను ప్రారంభిస్తున్నామన్నారు. నాడు కేసీఆర్ మనువడు పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్లను జైల్లో వేశారని, కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు నిబంధన అలాగే ఉంచారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పని చేస్తున్నప్పుడు 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేగా కూడా రాణిస్తారని తాను బలంగా నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు.

Related Posts
డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక
tarrif

ఈ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రపంచంలో మరో టారిఫ్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్, BRICS దేశాలు అమెరికా Read more

ట్రంప్ కేబినెట్ నామినీలకు వచ్చిన బాంబు ముప్పులు: FBI దర్యాప్తు
trump 2

డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రాన్సిషన్ జట్టు(ట్రంప్ అధికారంలోకి రాక ముందు, తన పరిపాలన ప్రారంభానికి అవసరమైన అధికారుల నియామకాలు, విధానాలు, ఏర్పాట్లు నిర్వహించే జట్టు) నవంబర్ 26 Read more

దుర్గ‌మ్మ ను దర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్
pawan durgamma

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు Read more

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్
Another encounter in Jammu and Kashmir

ఖన్యార్ : జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని ఖన్యార్ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నగరంలోని Read more