pawan HARIHARA

హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు తో పాటు OG మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు, మరియు ఎ.ఎం. రత్నం నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ డ్రామా, మరియు 17వ శతాబ్దం నాటి మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సినిమా కథ పురాతన భారతదేశంలో సాగే ఆత్మవిశ్వాసంతో కూడిన యోధుడి జీవిత చుట్టూ తిరుగుతుంది. హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన యాక్షన్, చారిత్రక సంఘటనలతో ఆకట్టుకుంటారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా..అర్జున్ రాంపాల్ – ఔరంగజేబ్ పాత్రలో, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే విజ‌యవాడ‌లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన చిత్ర‌బృందం పవ‌న్ క‌ళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ చివ‌రి షెడ్యూల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాయిన్ అయిన‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ ప‌వ‌న్ నిలుచున్న ఫొటోను పంచుకుంది. ఈ మూవీని 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

Related Posts
ట్రంప్-జెలెన్స్కీల భేటీ తర్వాత ఉక్రెయిన్ పరిస్థితి ఏమిటి?
ట్రంప్-జెలెన్స్కీల భేటీ తర్వాత ఉక్రెయిన్ పరిస్థి ఏమిటి?

ట్రంప్, జెలెన్స్కీ మధ్య శుక్రవారం జరిగిన భేటీ ఉద్రిక్తంగా మారింది. ట్రంప్, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతును తగ్గించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్, Read more

మంచు తుఫాన్‌ బీభత్సం..2,200 విమాన సర్వీసులు రద్దు
Snow storm disaster..2,200 flights canceled

వాషింగ్టన్‌ : మంచు తుఫాన్‌లు టెక్సాస్‌ నుంచి న్యూయార్క్‌ వరకు ‘గల్ఫ్‌ కోస్ట్‌’గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి Read more

సంక్రాంతి తర్వాత టీబీజేపీ అధ్యక్షుడి నియామకం
TBJP

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది. పార్టీ హైకమాండ్ సంక్రాంతి పండగ తర్వాత ఈ నియామకాన్ని Read more

Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం
Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం

హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, Read more