సైఫ్ అలీ ఖాన్ దాడిపై కరీనా వాంగ్మూలం

సైఫ్ అలీ ఖాన్ దాడిపై కరీనా వాంగ్మూలం

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. శుక్రవారం నాటికి ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రిలోని సాధారణ గదికి మారారు. సైఫ్ అలీ ఖాన్ నివసించే బాంద్రాలోని శరణ్ సత్గురు భవనంలో గురువారం తెల్లవారుజామున ఒక చొరబాటుదారుడు దాడి చేయడం కలకలం సృష్టించింది. నిందితుడు మెట్లు ఎక్కి 12వ అంతస్తులో ఉన్న సైఫ్ నివాసంలోకి ప్రవేశించాడు. ఈ దాడి సమయంలో నిందితుడు కత్తిని ఉపయోగించి సైఫ్ అలీ ఖాన్‌ను తీవ్రంగా గాయపరిచాడు.

సైఫ్ అలీ ఖాన్ దాడిపై కరీనా వాంగ్మూలం

సైఫ్ పై ఆరు కత్తిపోట్లు తగిలాయి. సైఫ్ వెన్నెముక మరియు మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి, నటుడు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వచ్చినప్పుడు, అతని వెన్నెముకలో కత్తి దాడి వాళ్ళ అతని వెన్నెముకలోని ద్రవం లీక్ అయ్యింది అని వైద్యులు చెప్పారు. అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్న నటుడు “ప్రమాదం నుండి బయటపడ్డాడు” అని ఆసుపత్రి అధికారులు తెలిపారు. లీలావతి ఆసుపత్రిలో ప్రస్తుతం సైఫ్ కోలుకుంటున్నారు.

సైఫ్ భార్య కరీనా కపూర్ శుక్రవారం పోలీసులకు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కరీనా వాంగ్మూలం ప్రకారం, చొరబాటుదారుడు చాలా దూకుడుగా ప్రవర్తించాడు. చొరబాటుదారుడు మొదట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతుల చిన్న కుమారుడు జహంగీర్ (జెహ్) బెడ్‌రూమ్‌లో కనిపించాడు. ఆ సమయంలో ఇంటి సహాయకురాలు అలారం మోగించింది. దీంతో సైఫ్ వెంటనే జోక్యం చేసుకుని, మహిళలను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు. అలాగే, దాడి చేసిన వ్యక్తి జహంగీర్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారని కరీనా పోలీసులకు వివరించారు. ఇంట్లో బహిరంగ ఉన్న ఆభరణాలను నిందితుడు తాకలేదని ఆమె స్పష్టం చేశారు. నిందితుడు సైఫ్ ఇంటి సహాయకుడిపై కూడా దాడి చేశాడు. దాడి జరిగినప్పుడు సైఫ్ అతన్ని ఆపేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

సైఫ్ అలీ ఖాన్ జనవరి 21న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని భావిస్తున్నారు. తన ఇంట్లో జరిగిన సంఘటన తర్వాత కరీనా తన సోదరి, నటి కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లారు. ఈ సంఘటనపై 30కి పైగా పోలీసు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అతను సంఘటన జరిగిన 48 గంటలకు పైగా పరారీలో ఉన్నాడు. సైఫ్ ను చికిత్స కోసం సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, ముంబై పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
రతన్ టాటా ఇక లేరు
ratan tata dies

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా Read more

ట్రంప్ టారిఫ్ పెంపు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని సూచిస్తుందా?
ట్రంప్ టారిఫ్ పెంపు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని సూచిస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా, మెక్సికో, మరియు చైనాలపై సుంకాల పెంపుదల శనివారం సాయంత్రం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ప్రకటనతో వైట్ హౌస్ నుండి ఇతర Read more

భద్రాద్రి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విరాళం
Donation by Telangana Grame

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రూ.1,02,322 విరాళాన్ని అందించింది. ఈ విరాళాన్ని బ్యాంకు మేనేజర్ ఉదయ్ తన సిబ్బందితో కలిసి ఆలయ Read more

ఆర్థిక మంత్రికి మరోసారి అరుదైన గౌరవం
Union Finance Minister Nirmala Sitharaman is once again a rare honour

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో Read more