chandrababu

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో సుమారు 50 రోజులకు పైగా ఉన్నారు. అనంతరం బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా చంద్రబాబు తరుఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ స్కాం జరిగిందని.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ 2023లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా.. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ కొట్టివేసింది. స్కిల్ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ ఫైల్‌ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరుఫుు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది.

Related Posts
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్
Pawan announced a donation

తలసేమియా బాధితుల కోసం పవన్ సాయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళాన్ని Read more

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల
Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ Read more

ఏపీలో త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
premium liquor stores

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల విక్రయానికి ప్రత్యేకంగా ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ Read more

Kavya Sri: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్‌పై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడి దాడి..
anchor kavya sri

రాజమండ్రిలో ఓ ఈవెంట్ యాంకర్ మరియు ఆమె తండ్రిపై దాడి జరిగిన విషాదకర సంఘటనలో, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు నల్లూరి శ్రీనివాస్, Read more