Jamili Elections bill

సాధారణ మెజారిటీతో జమిలికి అనుమతి

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును జాయింట్ పార్లమెంట్‌ కమిటీ (JPC) కి పంపడానికి లోక్‌సభ అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లైంది. ఎంతో కాలంగా దేశంలో జమిలీపై బీజేపీ కసరత్తు చేస్తున్నది. మూడోసారి బీజేపీ గెలుపొందడంతో జమిలీపై మరింత పట్టుదలతో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందేలా చేసుకున్నది.
తొలిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ విధానం
పార్లమెంట్‌ నూతన భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ విధానం ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై అనుమానం ఉన్న వాళ్లు ఓటింగ్‌ స్లిప్‌లతో క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు స్పీకర్‌ అనుమతించారు. దేశంలో లోక్‌సభతోపాటే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహించడం కోసం వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లును తీసుకొచ్చారు.
మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు
ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఇవాళ ఉదయం వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని భావిస్తున్నట్లు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై ఓటింగ్‌ నిర్వహించగా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ అనుమతి లభించినట్లయ్యింది.

Related Posts
మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్
మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్

టెక్ బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌ను ప్ర‌ధాని మోదీ క‌లిశారు. అమెరికా టూర్ వెళ్లిన మోదీ.. అక్క‌డ మ‌స్క్‌తో భేటీ అయ్యారు. అయితే బ్లెయిర్ హౌజ్‌లో జ‌రిగిన‌ భేటీలో Read more

2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో మరణించారు..
harshabardhan

కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన మొదటి పోస్టింగ్ కోసం హసన్ జిల్లాకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న Read more

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి : జగన్
Law and order has deteriorated in the state..Jagan

అమరావతి: ములాఖత్ లో వంశీని కలిసిన జగన్. వంశీ పై తప్పుడు కేసు పెట్టారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వల్లభనేని వంశీతో ములాఖత్ ముగిసిన Read more

మహారాష్ట్ర గడ్డపై గబ్బర్ సింగ్ వార్నింగ్
pawan warning

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్పీచ్ తో అదరగొట్టారు. శనివారం డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ Read more