Sajjala Bharghav Reddy

సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట

వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది.
ఫిర్యాదు చేయలేదు
భార్గవరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది విచారణకు అర్హత లేని కేసు అని ఆయన కోర్టుకు తెలిపారు. ఎవరిపై అయితే పోస్టులు పెట్టారో… వారు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎవరో మూడో వ్యక్తి చెపితే కేసులు నమోదు చేశారని చెప్పారు. ఐటీ సెక్షన్స్ కు బదులుగా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని భార్గవరెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ఫిబ్రవరికి వాయిదా
ఈ క్రమంలో, బీఎన్ఎస్ సెక్షన్ 35 (3)కి అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను అప్పటి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.

Related Posts
పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
ap pensions

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 5 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం Read more

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించిన యాజమాన్యం
vizag steel plant employees

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రమే Read more

రెండు నెలలు ఆ రైళ్లు బంద్
South Central Railway has announced 26 special trains for Sankranti

కుంభమేళా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్సవానికి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు పలు సాధారణ రైళ్లను మార్చి 1 వరకు Read more

యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అక్రమాలకు ఇకపై తావుండదని, తప్పు చేసేవారు భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో Read more