drugs3

సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ రపడుతున్న వేళా డ్రగ్స్ దొరకడం కలకలం సృష్టిస్తున్నది. డ్రగ్స్ ను ఏపీ నుంచి ముంబైకి తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఓ లారీలో డ్రగ్స్‌ను గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవు నుంచి వాటిని ముంబైకి తరలిస్తున్నారని తెలుస్తున్నది.
పట్టుబడిన డ్రగ్స్‌ను చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పరారైన్లు అధికారులు వెల్లడించారు.ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ, నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, దీనివెనక ఎవరున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు. న్యూ ఇయర్ సందర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర, తెలంగాణాలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

Related Posts
ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు: హరీష్ రావు
Harish Rao stakes in Anand

Harish Rao congratulated Bathukamma festival హైదరాబాద్‌: పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ Read more

25న ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ
mahadharna-postponed-in-nallagonda

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 25న జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసిహ్ లతో Read more

సాంకేతిక లోపం..నిలిచినపోయిన హైదరాబాద్‌ మెట్రో రైళ్లు
Technical error.Hyderabad metro trains stopped

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం మెట్రోలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. Read more

ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తప్పిన పెను ప్రమాదం
Big accident for MLA Payal

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం సాయంత్రం, హైదరాబాద్ నుండి ఆదిలాబాద్‌కు వెళ్తున్న సమయంలో, ఆమె కారు వెనుక నుండి Read more