Saree for Goddess Padmavati

శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు.

Related Posts
హైదరాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు
Child trafficking ganghyd

హైదరాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కలకలం రేపుతోంది. అహ్మదాబాద్‌కు చెందిన వందన అనే మహిళ నేతృత్వంలో ఓ పెద్ద ముఠా పిల్లలను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు Read more

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి
Fire accident in hospital..Six dead

దిండిగల్: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పొగతో ఊపిరి ఆడకపోవడం వల్లే వారు మరణించినట్టు Read more

తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ‌వారికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
Vaikuntha Darshan for those injured in the stampede

తిరుపతి: తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాటలో ఆరుగురు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు Read more

భారతీయ రైల్వే కొత్త రికార్డు: ఒకే రోజున 3 కోట్ల పైగా ప్రయాణికులు
train

భారతీయ రైల్వేలు 2024 నవంబర్ 4న ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఈ రోజు మొత్తం 3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్ళలో ప్రయాణించారు. ఇది Read more