సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చారు. రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.డిసెంబర్ 4న “పుష్ప 2” ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళా అభిమాని రేవతి మరణించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్, దిల్ రాజు కలిసి వైద్యులను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రేవతి కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందించారు. డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా చెరో రూ. 50 లక్షలు సాయం చేశారు.

ఈ ఘటనపై తన బాధను వ్యక్తం చేసిన అల్లు అర్జున్, బాధిత కుటుంబాలకు ఎప్పటికీ తోడుగా ఉంటానని చెప్పారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన ప్రమాదం క్రితం నెల టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.అల్లు అర్జున్, దిల్ రాజు కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనుండడంతో రామ్ గోపాల్ పేట్ పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించారు.ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించిన తీరుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడడం, ఆర్థిక సహాయం చేయడం అల్లు అర్జున్ ఉదారతను తెలియజేస్తోంది. అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.రేవతి కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం.
