duvvada srinivas

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ‌పై కేసు న‌మోదు

వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు అవ్వడం , పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ వెంట‌నే దువ్వాడ‌ను విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీస్ లు పంపారు. దివ్వెల మాధురితో సాన్నిహిత్యం కారణంగా గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు తరచుగా మీడియాకెక్కుతోంది. తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.

శ్రీనివాస్ విషయానికి వస్తే.. మొదటగా దువ్వాడ శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలై, 36552 ఓట్లతో మూడవస్థానంలో నిలిచాడు. దువ్వాడ శ్రీనివాస్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేసి 8387 ఓట్ల తేడాతో, 2019లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

దువ్వాడ శ్రీనివాస్ ను వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2021 ఫిబ్రవరి 25న ఖరారు చేశాడు. ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 2021 మార్చి 8న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు. ఆయన శాసనసభ్యుడిగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తో రాజకీయాలపై కంటే మాధురి పై ఎక్కువ ఫోకస్ పెట్టి మరింత గా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

Related Posts
Collectors’ Conference : ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
AP Collectors' Conference

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించనుంది. సచివాలయంలో జరిగే ఈ సదస్సులో రాష్ట్ర Read more

బిఆర్ఎస్ లోనే ఉన్న అంటూ గద్వాల్ ఎమ్మెల్యే క్లారిటీ
Gadwal MLA Bandla Krishna M

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు. కొందరు తనను Read more

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
lokesh300cr

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రేపు ఉదయం సా.4.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తారని అధికారికంగా తెలియజేశారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి, Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more