ప్రజాస్వామ్యంలో మీ రాజ్యం ఏంటి?: సుప్రీంకోర్టు

విడాకుల కోసం ఐదు కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశం

ఢిల్లీ, డిసెంబర్ 12,
వారిద్దరూ భార్యాభర్తలు. అయితే రెండు దశాబ్దాలుగు వారు చేస్తున్న పోరాటంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భార్యాభర్తల విడాకుల కేసులో వివాహాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు భార్యకు శాశ్వత భరణంగా రూ. 5 కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. అంతేకాక కుమారుడి పితృత్వ బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని, కాబట్టి శాశ్వత భరణం కింద ఆ మొత్తం చెల్లించాల్సిందేనని జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ ప్రసన్న వి.వరాలేతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. అలాగే, యువకుడైన కుమారుడి ఆర్థిక భద్రత, పోషణ కోసం కోటి రూపాయలు కేటాయించాలని ఆదేశించింది.

ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ భార్యాభర్తలు. వీరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయంచారు. ఈ కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. వీరు రెండు దశాబ్దాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. అంజుది అతి సున్నితత్వమని, తమ కుటుంబంలో ఆమె ఇమడలేదని ప్రవీణ్.. ప్రవీణ్ తనను సరిగా చూసుకోవడం లేదని అంజు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వైవాహిక బంధం నుంచి దూరం జరిగారు. ఈ నేపథ్యంలో వారికి కొన్ని ప్రత్యేకమైన షరతులతో తాజాగా అత్యున్నత న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
ఇటీవల కాలంలో దేశంలో విడాకులు శాతం పెరిగిపోతున్నది. తరచుగా కోర్టులు కూడా విచారం వ్వక్తం చేస్తున్నాయి. దంపతుల మధ్య ప్రేమ కొరవడడం బాధాకరం.
ఇద్దరూ దీర్ఘకాలంగా విడిగా ఉంటున్న నేపథ్యంలో తమ వైవాహిక బాధ్యతలను నిర్వర్తించే అవకాశం లేదని, వారి మధ్య బంధం కోలుకోలేని విధంగా తెగిపోయిన నేపథ్యంలో ఈ తీర్పు వెల్లడించింది. దంపతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరు పక్షాల సామర్థ్యాలు, ఉద్యోగావకాశాలు, వారి ఆదాయ వనరులు, ఆస్తులు.. వంటి 8 కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

Related Posts
ఆమ్ ఆద్మీ పార్టీపై రేఖాగుప్తా తీవ్ర విమర్శలు
ఆప్ పాలన దిల్లీకి ముప్పు - సీఎం రేఖా గుప్తా తీవ్ర విమర్శలు

దేశ రాజధానిలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఓ ప్రముఖ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ Read more

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు
Tenth Hall Tickets Available Today

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి Read more

కొండా సురేఖను వదిలేది లేదు – అఖిల్
akhil surekha

తమ ఫ్యామిలీ ఫై అనుచిత వ్యాఖ్యలను చేసిన మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. 'కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, Read more

Guntur: గుంటూరు నగర మేయర్ రాజీనామా!
Guntur City Mayor resigns!

Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్‌ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ Read more