vijayasai reddy

విజ‌య‌సాయిరెడ్డికి ఈడీ మ‌ళ్లీ నోటీసులు

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్న వైసీపీ నాయకుల అవినీతి చిట్టాను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ పోర్టు వ్య‌వ‌హారంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్ప‌టికే ప‌లు నోటీసులు జారీ చేసినప్పటికీ వివిధ‌ కార‌ణాల‌తో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌ళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ.. సోమ‌వారం త‌మ ఎదుట‌ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.


కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌, సెజ్‌లో క‌ర్నాటి వెంక‌టేశ్వ‌ర‌ రావు వాటాల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేవీ రావు ఫిర్యాదును ప‌రిశీలించిన ఈడీ.. విజ‌య‌సాయిరెడ్డి మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించింది.
ఈమేర‌కు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్ప‌టికే జారీ చేసిన నోటీసుల‌కు ప‌లు కార‌ణాల‌తో విచార‌ణ‌కు హాజరుకాలేనంటూ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఇక తాజా నోటీసుల నేప‌థ్యంలో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Related Posts
Chandrababu Naidu: బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ
Chandrababu Naidu: బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశాన్ని గురించి Read more

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. "జయకేతనం" పేరుతో నిర్వహించే ఈ సభ Read more

వల్లభనేని వంశీ అరెస్ట్ – అసలేమైందో తెలుసా?
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ – రాజకీయ వర్గాల్లో కలకలం

తెలంగాణ, 13 ఫిబ్రవరి 2025:ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.అరెస్టుకు Read more

లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్
లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినట్లు Read more