jayasuda police22

విచారణకు హాజరైన పేర్ని జయసుధ

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా పోలీస్ స్టేషన్‌కు పేర్ని జయసుధ వచ్చారు. తన న్యాయవాదులతో కలసి విచారణకు వచ్చిన పేర్ని జయసుధను.. రాబర్ట్‌సన్ పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏసు బాబు విచారిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం అంశంపై పేర్ని జయసుధ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, పేర్ని జయసుధ మచిలీప్పట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి పీఎస్ కు వచ్చారు. అయితే విచారణకు ఆమె తరఫు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ప్రస్తుతం పేర్ని జయసుధను ఆర్.పేట సీఐ ఏసుబాబు విచారిస్తున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని .. తన భార్య పేరిట గోడౌన్లు నిర్మించారు. అందులో రేషన్ బియ్యం బఫర్ నిల్వలను ఉంచారు. ఆ క్రమంలో దస్త్రాల్లో ఉన్న బియ్యం బస్తాల నిల్వలకు.. గోడౌన్లలో ఉన్న సరకుకు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వేలాది బియ్యం బస్తాల తేడా ఉండడంతో… పేర్ని నాని సతీమణికి నోటీసులు జారీ చేశారు.

Related Posts
రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పోసాని..
case file on posani

సినీ నటుడు , వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నాడు.తాజాగా గురువారం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. ఈ ప్రకటన చేశారు. తాను Read more

గిరిజన మహిళపై దాడి.. టీడీపీకి కొలికపూడి వివరణ
tdp mla kolikapudi

తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన Read more

Manda krishna: ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో జగన్ పై మందకృష్ణ ఫైర్
ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో జగన్ పై మందకృష్ణ ఫైర్

cఏపీలో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడంతో పాటు దీనిపై నియమించిన ఏక సభ్య కమిషన్ Read more

కిరణ్ రాయల్ పై ఆరోపణలు లక్ష్మి అరెస్ట్..
కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్..

తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి Read more