gachibowli flyover closed

వారం పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత..ఎందుకంటే..!!

హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. ఈ ఆంక్షలు అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటాయన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత కారణంగా, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వైపు ప్రయాణించే వాహనాలు బిచ్చారెడ్డి స్వీట్స్‌ ద్వారా మళ్లిస్తారు. అలాగే, ఐఐఐటీ జంక్షన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు కూడా గచ్చిబౌలి జంక్షన్‌ పక్కనుండి వెళ్తాయి. వాహనదారులు తమ ప్రయాణాలకు ముందుగా ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Posts
తమ్ముడి కుమారులను పట్టుకొని ఓదార్చిన చంద్రబాబు
cbn ramurthi

సీఎం చంద్రబాబు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ Read more

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!
school holidays in august

Dussehra holidays in AP from 3rd of this month! అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా Read more

‘తండేల్’ ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే
ఓటీటీ లోకి తండేల్ డేట్ ఖరారు.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో Read more

అమరావతి నిర్మాణానికి రూ.64,721 కోట్ల వ్యయం: మంత్రి నారాయణ
Amaravati construction cost Rs 64,721 crore.. Minister Narayana

అమరావతి: ఏపీ శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *