varma

వర్మపై ఒకటి , రెండు కాదు ఏకంగా 9 కేసుల నమోదు

సినీ డైరెక్టర్ , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి , రెండు కాదు ఏకంగా 09 కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు సహకరించలేదని ఆరోపణలు ఉన్నాయి.

మొన్న ఉదయం పోలీస్ బృందం ఆర్జీవీ ఇంటికి చేరుకుని విచారణ ప్రక్రియను కొనసాగించేందుకు ప్రయత్నించింది. ఆయన సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. ఆయన నోటీసులకు గడువు కావాలని ఇప్పటికే పోలీసులు దగ్గర మరింత సమయం కోరారు. వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఒక వీడియోను వర్మ విడుదల చేశారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ దీనిపై ఓ వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ తెలిపారు.

Related Posts
విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు
flightlanding

ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం విమాన ల్యాండింగ్ గేర్ వద్ద తనిఖీల్లో వెలుగు చూసిన మృతదేహాలు ధ్రువీకరించిన జెట్‌బ్లూ విమాన సంస్థ అమెరికాలో ఓ దారుణ Read more

ఏపీలో తహసీల్దార్లకు కీలక బాధ్యతలు అప్పగింత
ఏపీలో తహసీల్దార్లకు కీలక బాధ్యతలు అప్పగింత

ఏపీలో తహసీల్దార్లకు కీలక బాధ్యతలు అప్పగింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, జాతీయ స్థాయిలో చర్చలకు దిగకుండా, కొన్ని నిర్ణయాలను Read more

ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
Actor Mohan Raj passed away

తిరువనంతపురం: సినీ పరిశ్రమ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ తుది శ్వాస విడిచారు. 72 Read more

Revanth Reddy : ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ
Revanth Reddy letter to Prime Minister Modi

Revanth Reddy : ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ Read more