వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల

వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల

భవిష్యత్తులో వరదల నుంచి విజయవాడను కాపాడుతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. బుడమేరకు గండ్లు పడడంతో విజయవాడను జలవిలయం బారినపడింది. ఈ నేపథ్యంలో, నేడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుడమేరు వరద నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.

 వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల


వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ, నాటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే బుడమేరు ముంపునకు కారణం అని విమర్శించారు. బుడమేరు వరద నియంత్రణపై సీఎంకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని, ఆ మేరకు అధికారులతో సమీక్షించామని తెలిపారు. బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం వాటిల్లిందని, విజయవాడ నగరాన్ని కాపాడుకోవడంపై ఓ అవగాహనకు వచ్చామని తెలిపారు. నీటిపారుదల, రెవెన్యూ, పురపాలక శాఖలు సంయుక్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు వివరించారు.బుడమేరు పాత కాలువ సామర్థ్యం 3 వేల క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుందని, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించామని మంత్రి నిమ్మల వివరించారు. సమాంతరంగా కొత్త కాలువ తవ్వేందుకు కూడా అంచనాలకు ఆదేశించామని చెప్పారు.

ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి, అనంతరం కేంద్రానికి పంపిస్తామని నిమ్మల వెల్లడించారు. సీఎం సూచనలకు అనుగుణంగా బుడమేరు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అన్నారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు.

Related Posts
రేపు ఆరంభ పోర్టల్ ను ప్రారభించనున్నపవన్ కళ్యాణ్
రేపు ఆరంభ పోర్టల్ ను ప్రారభించనున్నపవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పంచాయతీ పన్నుల వసూళ్లలో పారదర్శకతను పెంచడం, అవకాసం సులభతను అందించడం మరియు ప్రభుత్వానికి Read more

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
ysrcp mp mvv ed

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 Read more

జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!
Special invitation to women for Janasena formation meeting.

అమరావతి: పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు Read more

MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగింపు
Term of office of MLCs

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ మేరకు మండలి వారికి అధికారికంగా వీడ్కోలు పలికారు. పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో ప్రముఖులు యనమల Read more