It is a religious party. Konda Surekha key comments

వరంగల్ మార్కెట్‌లో మాఫియా దందా నడుస్తుంది – కొండాసురేఖ

ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నాగార్జున ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్ట్ చేత మొట్టికాయలు వేయించుకుంది. ఆ తర్వాత కూడా పలు విమర్శల పాలైంది. తాజాగా వరంగల్ మార్కెట్‌లో ఓ మాఫియా దందా చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనర్హులకు మార్కెట్ లో షాపులను కేటాయించారని ఆమె ఆరోపించారు. మంగళవారం వరంగల్ లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించి మార్కెట్‌లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూరగాయల మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తుందని . అనర్హులను గుర్తించి తిరిగి షాపులను స్వాధీనం చేసుకుంటామన్నారు. చిరు వ్యాపారులను గుర్తించాలన్నారు. లైసెన్స్ ఇచ్చి మార్కెట్‌లో చోటు కల్పించాలన్నారు. గత సెక్రటరీ కేటాయించిన దుకాణాల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌లో పార్కింగ్‌తో పాటు మౌళిక సదుపాయలు కల్పిస్తామన్నారు.

డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడంతో పాటు కూరగాయల మార్కెట్ సమీపంలో వర్మీ కంపోస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అందరికి లాభం జరిగే విధంగా అర్హులకు షాపులను ప్లాట్స్ కేటాయిస్తామన్నారు. అద్దెల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. అలాగే డ్రా పద్ధతిలో దుకాణాలను.. కూరగాయల విక్రయాలు ప్లాట్ లను కేటాయిస్తామని. కూరగాయల మార్కెట్‌లోనే పూల దుకాణాలకు చోటు కలిపిస్తామని , త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు. మార్కెట్ లోని దుకాణాల పై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సెక్రటరీ, కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

Related Posts
సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ : మహేష్ గౌడ్
mahesh goud

సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌లో చేరికలు కూడా జోరుగా ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి Read more

వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Relief for YS Jagan in the Supreme Court

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు జగన్ పై ఉన్న కేసులను Read more

అమెరికాలో ట్రాన్స్‌జెండర్‌లు సైన్యంలో చేరడంపై ట్రంప్ ఆంక్షలు
trump 3

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డొనాల్డ్ ట్రంప్, 2024 జనవరి 20న వైట్ హౌస్‌లో తిరిగి చేరిన వెంటనే ఒక కీలక ఆదేశాన్ని జారీ చేయనున్నారని సమాచారం. Read more

భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం? మాజీ సీజేఐ
dychandrachud

భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఆరోపణలపై మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పందించారు. ఈ మేరకు ఆ ఆరోపణలు ఖండించారు. చట్టప్రకారమే తీర్పులు వెలువరించినట్లు చెప్పారు. Read more