Another encounter in Jammu and Kashmir 1

లార్నూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం నాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ హిలాల్ అహ్మద్ భట్‌ హత్య ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. భట్ గత అక్టోబర్ మొదటి వారంలో అపహరణకు గరయ్యాడు. ఆ తర్వాత బుల్లెట్లతో ఛిద్రమైన అతని మృతదేహాన్ని బలగాలు కనుగొన్నాయి. కాగా, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించింది. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని, ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని తెలిపింది.

Advertisements

ఇద్దరు ఉగ్రవాదులను సమర్ధవంతంగా మన బలగాలు మట్టుబెట్టాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించింది. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని విదేశీయుడిగా, ఒకరిని స్థానికుడిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన గంట తరువాత శ్రీనగర్ సిటీలోనూ అదే తరహా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బలగాల ఉచ్చులో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తాజా సమాచారం. శ్రీనగర్‌లో గత 30 నెలల తర్వాత ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకోడవం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2022 ఏప్రిల్‌లో బిషంబర్ నగర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

Related Posts
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్ యాదవ్,అభి యాదవ్,రామ్ యాదవ్ పెద్ది యాదవ్ ల అద్వర్యం వెళ్తున్న అయ్యప్ప స్వాములు బస్సు Read more

తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ మ‌త్స్య‌కారులు
తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ మ‌త్స్య‌కారులు

మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్రంలో మత్స్యకారుల బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో, 80 శాతం Read more

Uttarakhand: ఈదురు గాలులు,వడగండ్లతో ఉత్తరాఖండ్‌ అతలాకుతులం
ఈదురు గాలులు,వడగండ్లతో ఉత్తరాఖండ్‌ అతలాకుతులం

ఉత్తరాఖండ్‌లోని చామోలి జిల్లాలో బుధవారం భారీ వర్షం కారణంగా తీవ్ర నష్టం జరిగింది. దాదాపు మూడు గంటలపాటు కురిసిన వర్షం, భారీ వడగాలులతో కలసి, రాష్ట్రంలో తీవ్రమైన Read more

Karumuri Nageswara Rao : మాజీ మంత్రి కారుమూరి పై కేసు నమోదు
Karumuri Nageswara Rao మాజీ మంత్రి కారుమూరి పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మంటలు రేగేలా చేసారు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. ఏలూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలపై Read more

×