nitin gadkari

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స: నితిన్‌ గడ్కరీ

నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదంలో గాయపడినవారికి చికిత్స వెంటనే అందితే ప్రాణాలతో బయటపడతారు. అందుకు ఆర్థిక సాయం కావాలి. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు.

ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని గడ్కరీ తెలిపారు.

పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఢిల్లీలోని భారత్‌ మండపంలో మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారని.. అందులో 30 వేల మంది హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే మరణించినట్లు తెలిపారు. మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సుగల వారే ఉండటం బాధాకర విషయమన్నారు.

Related Posts
మహారాష్ట్రలో బస్సు ఛార్జీలు పెంపు..
Bus fare hike in Maharashtra

ముంబయి: మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి Read more

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
pawan kalyan to participate in palle panduga in kankipadu

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అర్థవంతమైన పండుగగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. Read more

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్

ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడిగా ఉన్న ఛోటా రాజన్, 2001లో హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసుకు సంబంధించి 2024లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, Read more

కొత్త కారు కొన్న ట్రంప్.. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు
కొత్త కారు కొన్న ట్రంప్.. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మధ్య ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్చి 11న ట్రంప్, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *