nagavamsi

రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు

టాలీవుడ్ ప్ర‌ముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే ముఖ్య‌మంత్రిని కలుస్తామ‌ని నిర్మాత నాగ‌వంశీ తాజాగా మీడియాకు తెలిపారు.

టికెట్ ధ‌ర‌ల పెంపు, ప్రీమియ‌ర్ షోల‌పై చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న కార‌ణంగా ఇక‌పై టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ‌లో స్పెష‌ల్ షోలు, బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్‌ ఇచ్చేది లేద‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
కొత్త సినిమాలపై ప్రభావం
దీని ప్ర‌భావం వచ్చే సంక్రాంతికి విడుద‌ల కానున్న పెద్ద సినిమాలు ‘గేమ్ ఛేంజ‌ర్‌’, ‘డాకు మ‌హారాజ్‌’, ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’పై ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
మీడియాతో నాగ‌వంశీ
ఇక బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా వ‌స్తున్న డాకూ మ‌హారాజ్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం మేక‌ర్స్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా సీఎంను క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Related Posts
క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయం చేసిన ఐటీసీ నిమైల్
ITC Nimile introduced Clean Equal Mission

సమానత్వంతో కూడిన భవిష్యత్తు కోసం క్లీన్ ఈక్వల్ టుడేని సమిష్టిగా నిర్మించే ఆలోచన రేకెత్తించే, కార్యాచరణ ఆధారిత ప్రయత్నం.. హైదరాబాద్: భారతదేశంలో విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, Read more

అమెరికా 47వ అధ్యక్షుడిగా నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
donald trump

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు Read more

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి..
Make your Diwali celebrations healthy with the goodness of almonds

న్యూఢిల్లీ: దీపకాంతుల పండుగ దీపావళి. ఆనందం మరియు ఉత్సాహంతో వేడుక జరుపుకోవడానికి ప్రియమైన వారిని ఒకచోట చేర్చుతుంది. అయితే, ఈ పండుగ సమయం తరచుగా చక్కెరతో కూడిన Read more

కలెక్టర్ మీటింగ్ లో రమ్మీ ఆడిన DRO.. ఏంటి సర్ ఇది..?
DRO rummy

అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా వ్యవహారం కలకలం రేపింది. ఎస్సీ వర్గీకరణ సమస్యలపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ Read more