elections

రేపు లోక్‌సభలో జమిలి ఎలక్షన్‌ బిల్లు..!

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. రేపు (మంగళవారం) లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.
బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. తమ బలం పెరగడంతో జమిలి ఎన్నికలపై తన దృష్టిని సారించింది. వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు)ను సోమవారం సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రివైజ్‌ చేసిన లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్‌ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. మంగళవారం ఈ బిల్లులు లోక్‌షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
జమిలి ఎన్నికలు కొత్తదేమీ కాదు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది.

ఇండియా కూటమి అనుమతి ఇచ్చేనా?
ఇండియా కూటమి ముందు నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నది. మరి ఈ జమిలి బిల్లును ఎంతవరకు మద్దతు ఇస్తుందో చూడాలి.

Related Posts
దీపావళికి ముందు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..ప్రజల ఇబ్బందులు
Increased air pollution in Delhi before Diwali.People problems

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, Read more

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం
vinod

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది.అనారోగ్య పరిస్థితితో కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ గతం ఇటీవల థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరిన Read more

నిలిచిన SBI సేవలు
మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే నిధులు: ఎస్బిఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవలు నిన్న సాయంత్రం నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. ముఖ్యంగా యూపీఐ (UPI) Read more

బిల్‌ క్లింటన్ కు అస్వస్థత
former us president bill clinton hospitalised

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్‌ జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు క్లింటన్‌ Read more