Central cabinet meeting tomorrow

రేపు కేంద్ర కేబినెట్ భేటీ..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే పలు ప్రాజెక్టులు, అభివద్ధి పథకాలకు కేంద్ర కేబినెట్ నిధులు మంజూరుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. అదేవిధంగా ఈ నెలలో జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇస్తున్న హామీల మేరకు కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ , జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముండగా.. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నందున వాటికి ప్యాకేజీ లేదా కేంద్ర పథకాల్లో మెజార్టీ వాటా ఇవ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Related Posts
రాహుల్ గాంధీ సూచన: కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం చర్యలు
congres party

మహారాష్ట్ర మరియు హర్యానాలో వరుసగా జరిగిన ఎన్నికల ఓటముల కారణంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆలోచన మరియు చర్యలకు పిలుపులు పెడుతున్నారు. ఈ ఓటములు కాంగ్రెస్ Read more

ఇండియా , యుకె మరియు యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా
BAFTA reveals nominees for Breakthrough 2024 across India UK and USA

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా), ఈ రోజు చలనచిత్రం, టెలివిజన్ మరియు గేమ్‌ల పరిశ్రమల నుండి తమ Read more

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వ విధానాలను, ప్రణాళికలను ప్రకటించేందుకు కీలకంగా మారనున్నాయి. Read more

బాలాసాహెబ్ షిండే మరణం: పోలింగ్ బూత్ వద్ద విషాద ఘటన..
beed independent candidate

బీడ్ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి ఎదురుచూస్తున్న స్వతంత్ర అభ్యర్థి బాలాసాహెబ్ షిండే గుండెపోటు చెందారు.ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. Read more