Sadar as state festival of telangana govt issued go

రాష్ట్ర పండుగగా ‘సదర్’: ప్రభుత్వం జీవో జారీ

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం యాదవ్‌ సోదరులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇకపై సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా జరగపనున్నారు. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండగ హోదా కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ సదర్ సమ్మేళనాన్ని యాదవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

Advertisements

తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా సదర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీపావళి తర్వాత రెండో రోజు యాదవ కులస్తులు ఈ సదర్ వేడుకలను నిర్వహిస్తారు. జంట నగరాల్లో ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా సదర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. సిటీలోని ముషీరాబాద్ లో నిర్వహించే పెద్ద సదర్ చాలా ఫేమస్. యాదవుల తమ వద్ద గల దున్నపోతుల్లో బలమైన దున్నపోతులను అందంగా అలంకరించి ఈ పండగలో ప్రదర్శిస్తారు.

Related Posts
మల్లన్న వ్యాఖ్యలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని మధుయాష్కీ డిమాండ్
madhu

తెలంగాణలో కులగణన అంశం మరోసారి రాజకీయం రేపుతోంది. తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కులగణనపై Read more

అంబటి రాంబాబు పై కేసు నమోదు.. !
case has been registered against Ambati Rambabu.

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ఏపీ పోలీసులు అంబటి రాంబాబు పై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన Read more

Waqf Bill : వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం సవాల్
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ బిల్లు

పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు–2025 ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం తీవ్ర వ్యతిరేకత Read more

Fly Over : ఫ్లైఓవర్ల కింద నిలబడే ముందు ఇది తెలుసుకోండి!
Fly Over ఫ్లైఓవర్ల కింద నిలబడే ముందు ఇది తెలుసుకోండి!

ఇప్పుడు మహానగరాల్లో ఓ కొత్త భయం రాజేస్తోంది.ఫ్లైఓవర్ల కింద నిలబడటం చాలా ప్రమాదకరం అయింది.ఎప్పుడు పెచ్చు ఊడి ఎవరి మీద పడుతుందో తెలియదు.వర్షం వచ్చినా, ట్రాఫిక్ జామ్ Read more

×