The first case of Guillain Barre syndrome has been registered in the state

రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు

హైదరాబాద్‌: కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్‌ బారే సిండ్రోల్‌ హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణెలో 130కిపైగా జీబీఎస్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తొలి బీజీఎస్‌ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇదని తెలిపారు.

image

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వెల్లడించారు. అయితే ఈ వైరస్‌ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, జీబీఎస్‌ అంటు వ్యాధి కాదని, చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చన్నారు.

కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే వందకుపైగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత నరాల వ్యవస్థపైనే దాడిచేస్తుంది.

Related Posts
బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్
mahesh kumar

తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ను పాకిస్థాన్ క్రికెట్ Read more

ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర
ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు మహారాష్ట్ర

ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర లో ఔరంగజేబ్ సమాధి తొలగించాలన్న డిమాండ్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శంభాజీనగర్ Read more

ఆప్-బీజేపీ పోస్టర్ యుద్ధం
ఆప్ బీజేపీ పోస్టర్ యుద్ధం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య శనివారం పోస్టర్ యుద్ధం ఆరంభమైంది. Read more

అన్ని షోల‌కి పిల్ల‌ల‌ను అనుమ‌తించాలి:తెలంగాణ హైకోర్టు
అన్ని షోల‌కి పిల్ల‌ల‌ను అనుమ‌తించాలి:తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు మ‌రోసారి కీల‌క తీర్పును వెల్ల‌డించింది. తెలంగాణలోని  ప్రీమియ‌ర్, బెనిఫిట్‌ షోల‌కు అనుమ‌తి లేద‌ని హైకోర్టు మ‌రోసారి తెలిపింది. జ‌న‌వ‌రి 21న ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను నేడు Read more