RGV

రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ నోటీసులు

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో ‘వ్యూహం’ సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్ ప్రస్తుత ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు… అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశారు.
నింబంధనలకు విరుద్ధంగా..
ఫైబర్ నెట్ ద్వారా టెలికాస్ట్ చేసిన ‘వ్యూహం’ సినిమాకు వ్యూస్ లేకున్నా… ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్లు చెల్లించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నింబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు 15 రోజుల్లోగా వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Posts
చంద్రబాబు లేఖపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy responded to Chandrababu's letter

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన టీటీడీకి సంబంధించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించిన నేపథ్యంలో ఈ కృతజ్ఞతలు Read more

జగన్ భారీ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారు:బొలిశెట్టి శ్రీనివాస్
జగన్ సీఎం అయిన తర్వాతే కోట్లాది అక్రమాస్తులు! – బొలిశెట్టి విమర్శలు

సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కృషితో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఎదగలేదని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ Read more

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
A huge fire broke out in Parawada Pharmacy

అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు Read more

చంద్రబాబుతో అంబుల వైష్ణవి భేటీ
చంద్రబాబుతో అంబుల వైష్ణవి భేటీ

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా, వైష్ణవిని అభినందిస్తూ, రాష్ట్ర Read more