narendra modi

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ యుద్ధనౌకలను రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ఈ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్నారాయన. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ నౌకాదళం ఇక మరింత శక్తిమంతమైంది. సముద్ర జలాల్లో గస్తీని పెంచడం, ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా రూపుదిద్దుకుంటోంది. చైనా దక్షిణ సముద్ర తీర ప్రాంతం నుంచి ముప్పు పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత శక్తిమంతమైన మూడు యుద్ధనౌకలు బరిలోకి దిగాయి.


తొలుత- నౌకాదళాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్- ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్‌పోర్ట్స్ సామర్థ్యం రెట్టింపు అవుతోందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దలాది కొత్త నౌకలు, కొత్త కంటైనర్లు అవసరమౌతాయని మోదీ పేర్కొన్నారు. వాటిని తయారు చేసుకునే క్రమంలో దేశవ్యాప్తంగా గల అన్ని పోర్టులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతమివ్వబోతోన్నాయని అన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు. జనావాసాలకు దూరంగా ఉంటూ వస్తోన్న దీవులను కూడా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతను ఇస్తోన్నామని మోదీ చెప్పారు.

Related Posts
తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
High tension at Telangana Bhavan. Heavy deployment of police

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కారు రే సు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం Read more

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ Read more

అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది – ట్రంప్
trump

అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, తమ దేశ సైన్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఊహించలేని విధంగా పునర్నిర్మాణం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన Read more

ఇంటర్ విద్యార్థిని పై ప్రేమోన్మాది ఘాతుకం
A lover who killed an inter

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17) పై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ Read more