WhatsApp Image 2024 12 16 at 3.57.13 PM

మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరించారు.
ఇరుదేశాల మధ్య ఒప్పందం
ఈ సందర్భంగా రెండు దేశాలమధ్య కొన్ని కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది.
వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై ఒప్పందం జరిగినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందన్నారు.
దేశాల ప్రయోజనాల కోసం..
నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ విధానం, సాగర్‌ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా.. కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలో పిన్న వయసులో ప్రెసిడెంట్ గా ఎన్నికై, తొలిసారిగా మన దేశానికి వచ్చారు.

Advertisements
Related Posts
SLBC టన్నెల్లో రోబోలతో సెర్చ్ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

SLBC టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం గత 23 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సహాయక బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, Read more

ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న పతంజలి
ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న పతంజలి

హోలీ పండుగ సంబరాలు దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకుతున్నాయి.చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంగుల పండుగలో మునిగితేలుతున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలతో, పాటలతో హోలీ Read more

తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు
health condition of the younger brother is serious. CM Chandrababus visit to Maharashtra is cancelled

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజులుగా Read more

రష్యాతో భారత్ సంబంధాల కారణంగా ఆస్ట్రేలియాకు కష్టాలు లేవు : జైషంకర్
jaishankar

భారత విదేశాంగ మంత్రిగా ఉన్న డాక్టర్ ఎస్. జైషంకర్, స్నేహపూర్వకమైన మరియు స్పష్టమైన విధంగా భారత్ యొక్క జియోపొలిటికల్ దృష్టిని వెల్లడించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన తాజాగా Read more

Advertisements
×