women

మైనర్‌ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకునిపోతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఈ రంగం ఆ రంగం అని కాదు, దాదాపు అన్నిరంగాల్లో ఈ వేధింపులకు గురి అవుతున్నారు. కేరళ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లకాలంగా ఏకంగా 60 మంది తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మైనర్‌ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
18 ఏళ్ల ఆ క్రీడాకారిణి తాను మైనర్‌గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Advertisements

లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ సమాఖ్య నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్‌లో క్రీడాకారిణి తనకు జరిగిన దారుణాల గురించి వివరించింది. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత కోచ్‌లు, క్లాస్​మేట్స్, అథ్లెట్స్​ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడించింది.

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు 62 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలిని కౌన్సిలింగ్‌కు పంపించినట్లు పథనంథిట్ట ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Related Posts
15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన
'Ramayana' performance

ఈ నెల 15న పార్లమెంటులో భారతదేశపు ప్రఖ్యాత మహాకావ్యమైన 'రామాయణం'ను ఆధారంగా తీసుకుని రూపొందించిన యానిమేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' Read more

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో బస్సు నది‌లో పడింది.
pok

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో గిల్‌గిట్-బాల్టిస్టాన్ ప్రాంతంలో నవంబర్ 12న ఒక దుర్ఘటన జరిగింది. ఒక బస్సు, దాదాపు ఇరవై మంది వివాహ అతిథులను తీసుకుని, ఇండస్ నదిలో పడిపోయింది. Read more

సింగపూర్ కంపెనీ చేతికి హల్దిరామ్స్.. టాటాతో సహా బడా కంపెనీల క్యూ..
సింగపూర్ కంపెనీ చేతికి హల్దిరామ్స్.. టాటాతో సహా బడా కంపెనీల క్యూ..

ప్రముఖ స్నాక్స్ అండ్ స్వీట్స్ తయారీ సంస్థ హల్దిరామ్‌లో వాటాను సొంతం చేసుకునేందుకు చాల కంపెనీలు పోటీ పడ్డాయి. కానీ వీటన్నిటిని అధిగమించి సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడి Read more

రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు
Rajahmundry to Delhi.. Start of flight service

రాజమండ్రి: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌లు ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ పరిణామానికి ముందు, ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి తొలి Read more

×