Pawan Kalyan Dil Raju

మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం:పవన్, దిల్ రాజు

‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణించిన ఇద్దరు అభిమానుల‌కు నిర్మాత దిల్‌రాజు రూ.10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఆ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) మ‌ర‌ణించారు.ఇక ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే నిర్మాత దిల్‌రాజు మీడియా స‌మ‌క్షంలో స్పందించారు.

ఆయ‌న మాట్లాడుతూ.. ” ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఆ విష‌యంపై మేం సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను.

నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను” అని అన్నారు.

Related Posts
స్టీల్స్ ప్లాంట్ ను కేంద్రం ఆదుకుంటుంది – BJP చీఫ్ పురందీశ్వరి
purandeswari modi tour

రాష్ట్ర BJP అధ్యక్షురాలు పురందీశ్వరి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం Read more

సుప్రీం కోర్ట్ లో అవినాష్ రమేష్ కు ఊరట
సుప్రీం కోర్ట్ లో అవినాష్ రమేష్ కు ఊరట

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాసం మరియు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు విచారణ నిర్వహించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న Read more

తెలంగాణ మహిళా కమిషన్‌కు సింగర్‌ కల్పన ఫిర్యాదు
Singer Kalpana files complaint with Telangana Women's Commission

హైదరాబాద్‌: సింగర్‌ కల్పన మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారదకు Read more

షారుఖ్ , సంజయ్ , సల్మాన్ , గోవిందా,అమీర్ ఖాన్..ఎంతో మంది హీరోలతో నటించా
mamatha kulakarni

ఒకప్పుడు తన అందం, అభినయంతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసిన స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పట్లో యువత గుండెల్లో తన అందంతో Read more