ttd counters

మూతబడ్డ శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్లు

తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు క్లోజ్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తులకు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన కోటా పూర్తికావడంతో కౌంటర్లు క్లోజ్ చేశారు. ఈ నెల 13న తిరిగి వైకుంఠ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజూ 40 వేల టికెట్ల చొప్పున ఏరోజుకు ఆరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Advertisements

ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడు రోజులకు స్వామి వారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏరోజుకు ఆరోజు టోకెన్లు జారీ చేస్తామని వివరించింది. కాగా, వైకుంఠ దర్శన టోకెన్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం తర్వాత భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ.. గురువారం ఉదయం టోకెన్లను జారీ చేసింది.

Related Posts
మోదీ అమిత్ లకు చంద్రబాబు కృతజ్ఞతలు
మోదీ, అమిత్ లకు చంద్రబాబు కృతజ్ఞతలు

గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల బారిన పడింది. వరదలు, అకాల వర్షాలు, తుఫానులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. వేలాది Read more

ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం
ఈడీ ఎదుట విజయసాయి రెడ్డి వాంగ్మూలం

వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు కారణం కాకినాడ సముద్ర ఓడరేవు Read more

నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన. గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటారు మార్కెట్‌లో జరుగుతున్న పరిస్థితులపై వారికి భరోసా రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో Read more

కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల పెనాల్టీ రద్దు: జీవీ రెడ్డి
Cancellation of Rs.100 crore penalty for cable operators.. GV Reddy

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌కు సంబంధించి ఛైర్మన్ జీవీ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కేబుల్ ఆపరేటర్లకు విధించిన రూ.100 కోట్లు పెనాల్టీలను Read more

Advertisements
×