Minister Nara Lokesh visit to America has ended

ముగిసిన మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పరిశ్రమల ప్రతినిధుల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై నమ్మకం కలిగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలతో పాటు సీఎం చంద్రబాబు విజన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఐదేళ్ల విధ్వంసక పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా లోకేశ్‌ పర్యటన సాగింది. ఆయన ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఈ భేటీల ఫలితంగా జనవరిలో దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్దఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేశ్ తెలిపారు. చివరి రోజున న్యూయార్క్‌లోని విట్‌ బై హోటల్‌లో పారిశ్రామివేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ఛైర్మన్‌ పూర్ణ ఆర్‌ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్‌ రద్దీలో కాలినడకన వెళ్లారు. బ్లూప్రింట్‌తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా అమెరికా పారిశ్రామికవేత్తలకు లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

గతనెల 25వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌ వారం రోజులపాటు 100మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజనరీ లీడర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వాన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారం రోజులు అవిశ్రాంతంగా సాగించిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్ విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కన్ ఎక్స్, ఈక్వెనెక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

Related Posts
Visakhapatnam:రుషికొండ బీచ్‌కు మళ్ళీ బ్లూఫాగ్‌ గుర్తింపు
Visakhapatnam:రుషికొండ బీచ్‌కు మళ్ళీ బ్లూఫాగ్‌ గుర్తింపు

విశాఖపట్నం రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మరోసారి లభించింది. 2020లో తొలిసారిగా ఈ గుర్తింపును పొందిన రుషికొండ బీచ్, కొన్ని కారణాలతో ఇటీవల ఈ హోదాను Read more

పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్
revanth delhi

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఆర్థిక శాఖ విడుదల చేసింది. మొత్తం రూ.446 కోట్ల బకాయిలను Read more

అదానీ కేసులో మరో ట్విస్ట్
Another twist in the Adani

భారత్-అమెరికా సంబంధాలకు ముప్పు భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పై కొనసాగుతున్న లంచం కేసు కొత్త మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు Read more

మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన నారా లోకేష్
lokesh mahakunbhamela

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కు హాజరయ్యారు. హిందూ సంప్రదాయ ప్రకారం పవిత్ర కుంభమేళా లో పాల్గొనడం విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ Read more