Lokayukta notice to Chief Minister Siddaramaiah

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు..

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, తనకు లోకాయుక్త పోలీసుల నుంచి నోటీసులు అందినట్టు సిద్ధరామయ్య కూడా వెల్లడించారు. అలాగే, నోటీసుల్లో పేర్కొన్నట్టుగా ఈ నెల 6వ తేదీన లోకాయుక్త ఎదుట హాజరవుతున్నట్టు చెప్పారు. ఇదే కేసులో ఆయన భార్య పార్వతిని గత నెల 25వ తేదీన విచారించిన విషయం తెల్సిందే.

Advertisements

కాగా, బుధవారం ఉదయం లోకాయుక్త ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు కొంత భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో పోలీసులు సెప్టెంబరు 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ భూవివాదం ఇపుడు సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related Posts
రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్ కు టెండర్లు – ఏపీ సర్కార్
రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్ కు టెండర్లు - ఏపీ సర్కార్

అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులు కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కసరత్తు ప్రారంభించింది. Read more

UPI : మరోసారి యూపీఐ సేవల్లో అంతరాయం
UPI services disrupted across the country

దేశవ్యాప్తంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు మరోసారి అంతరించాయి. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, బీమ్ వంటి యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ పనిచేయకపోవడంతో Read more

చైనా ఖాతాలో మరో రికార్డు
చైనా ఖాతాలో మరో రికార్డు

భూగర్భ పరిశోధనలో చైనా మరో మైలురాయిని సాధించింది. భూమి అంతరాళాన్ని అధ్యయనం చేయడానికి చైనా 10.9 కిలోమీటర్ల లోతైన బోరు బావిని తవ్వి ఆసియాలోనే అత్యంత లోతైన Read more

మైకులో చెప్పడానికి సీఎం రేవంత్ ఎలాంటి మంచి చేయలేదు – కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రత్యర్థులపై సెటైర్లు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "మైకులో Read more

×