Vemireddy couple meet CM Chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులు సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతిని ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేడు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రశాంతి రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరోవైపు నిన్న నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం జరగడం తెలిసిందే. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే, వేదికపై ఉన్న ఆయనకు అధికారులు బొకే ఇవ్వడం మర్చిపోయారు. దాంతో ఆయన అలిగి అక్కడ్నించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా భర్త వెంటే అక్కడ్నించి వెళ్లిపోయారు.

Related Posts
భక్తులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: జగన్‌
It is sad that devotees lost their lives.. Jagan

అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి Read more

వ్యవసాయ కూలీల మృతి – గుంటూరు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ హామీ
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

అమరావతి, ఫిబ్రవరి 17 : గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో Read more

రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర.. కైవ్ లో సమావేశం
రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర.. కైవ్ లో సమావేశం

రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన మూడేళ్లైన సందర్భంగా, ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌కు మద్దతు తెలియజేయడానికి కైవ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన ఉక్రెయిన్‌కు రాజనీతి, భద్రత, ఆర్థిక పరంగా Read more

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
CM Chandrababu brother Ramamurthy Naidu passed away

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో Read more