Manchu Manoj Clarification on His Emotional Speech.jpg

మీడియాపై జరిగిన దాడికి మంచు మనోజ్ క్షమాపణలు

  • మీడియా ముందు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మనోజ్

హైదరాబాద్:
సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నట్లు ప్రకటించారు. మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని చెప్పారు. తాను తన కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదని, ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నానని వివరించారు. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారని, నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదని చెప్పారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు.

Advertisements

Related Posts
Donald Trump: ట్రంప్ ఇరాన్‌పై కఠిన హెచ్చరిక: “ఒప్పందం కుదుర్చుకోకపోతే, బాంబులు పేలుతాయి”
విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం

ట్రంప్ బెదిరింపుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని ఆపకపోతే, అమెరికా బాంబు దాడులు నిర్వహిస్తుందని బెదిరించారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు Read more

ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?
ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించేందుకు అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఇందులో విద్యార్థులకు అవసరమైన అన్ని వివరాలను పొందుపరిచారు. కొత్త Read more

రెపోరేటు తగ్గింపుతో మీ EMI ఎంత తగ్గుతుందో తెలుసా..?
Home loan repo down

బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పరిణామంగా రిపో రేట్ తగ్గింపు వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంలో Read more

పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..
పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన Read more

×