kodalinani

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , దోపిడీలకు మూల్యం చెల్లించుకుంటున్నారు. అధికార అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లు చేసిన వారిపై ఇప్పుడు వరుస కేసులు నమోదు చేస్తున్నారు.ఇప్పటికే పలువురి ఫై కేసులు నమోదు కావడం తో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఇప్పుడు మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని ఫై కేసు నమోదు అయ్యింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారంటూ ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు.

అలాగే కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి కూడా ఉన్నాడు.

Related Posts
America :అమెరికాలో భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు
అమెరికాలో భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. చట్టవిరుద్ధ నిరసనలపై కఠిన Read more

కలిసి పనిచేద్దాం : భారత్‌కు చైనా పిలుపు
Let's work together.. China call to India

బీజింగ్‌ : నిన్న మొన్నటి వరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ఇప్పుడు స్వరం మార్చింది. ట్రంప్ సుంకాల పెంపుతో చిక్కుల్లో పడే ఛాన్స్ ఉండటంతో Read more

బీజేపీలో చేరిన 8 మంది ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలు
8 former AAP MLAs joined BJP

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టిదెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 Read more

నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
registration charges

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా భూక్రయ విక్రయాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరియు ఇతర లావాదేవీలు పెరిగాయి. చార్జీల పెంపు Read more