Former minister Kakani Govardhan Reddy house arrest

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్టు

అమరావతి: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కూనుపూరు కాలువ పరిశీలనకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. అయితే నెల్లూరులో కాకాని హౌస్ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకాని ఇంటి వద్ధ భారీగా పోలీసులు మోహరించారు. కాకాని హౌస్ అరెస్టును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీశ్రేణులు ఆందోళనకు దిగాయి నెల్లూరు సంగెం ఆనకట్ట వద్ధ టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు బల ప్రదర్శనకు దిగాయి. దీంతో కాకాని కూనుపూరు కాలువ కట్ట పరిశీలనకు వస్తే రగడ తలెత్తవచ్చన్న భావించిన పోలీసులు కాకానిని హౌస్ అరెస్టు చేశారు.

కూటమి ప్రభుత్వ విధానాలపై కాకాని తరుచూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, మధ్యం మాఫియాను కూటమి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, సీఎం చంద్రబాబుకు దమ్ముంటే వారి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కాకాని సవాల్ విసిరారు.

Related Posts
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు
High Court verdict on KTR quash petition today

హైదరాబాద్‌: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను Read more

తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.

ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై భారత రైల్వే స్పందించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. Read more

ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయం – షర్మిల
ys sharmila

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు Read more

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం
telugu states

ఐదు రాష్ట్రాలకు మొత్తంగా రూ.1,554.99 కోట్లు విడుదల కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ నిధుల కింద ఐదు రాష్ట్రాలకు మొత్తంగా రూ.1,554.99 కోట్లు విడుదల చేసింది. ఈ Read more