pulivendula1

మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే

ప్రతి కార్యకర్త కాలరు ఎగిరేసేలా పాలన చేశాం
👉 కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు
👉 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు
👉అధికారం వున్న లేకున్నా నిత్యం ప్రజల కోసమే పోరాటం
👉ఆపద్దాలు చెప్పలేకే ప్రతిపక్షంలో ఉన్నాం
👉 2027 చివరి నాటికి జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం
👉కష్టాలు శాశ్వతం కాదు,కలిసి కట్టుగా పని చేద్దాం
👉మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే
👉కడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్

పులివెందుల(ప్రభాతవార్త)

pulivendula2

కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని కష్టాలు అనేవి శాశ్వతం కాదని మనమందరం కలిసికట్టుగా పని చేయాలని , మోసపూరిత హామీలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడని మనం అబద్ధాలు ఆడలేకే ప్రతిపక్షంలో ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా మొదటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకుని వైయస్సార్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించిన అనంతరం ఆభిమానులకు అభివాదం చేస్తూ అనంతరం ఇడుపులపాయలోని ఎస్టేట్ నందు వున్న చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని అనంతరం కడప ముఖ్య నేతలు మరియు కార్పొరేట్లతో అయినా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అలవి గానీ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పులివెందుల పర్యటనలో అన్నారు.కష్టాలు అనేవి శాశ్వతం కావు, కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని మనమందరం కలిసికట్టుగా పని చేయాలి అని దేశ చరిత్ర లోనే ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశామని , కేవలం అపద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. కానీ,మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చామని కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదన్నారు.

pulivendula3

కార్యకర్తలు కాలరు ఎగరేసుకునేలా పాలన చేశామని అధైర్య పడవద్దు అన్నారు. 2027 చివరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించగా అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారని అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి అని ఆయన నేతలకు సూచించారు.కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే భయపడే పరిస్ధితి నెలకొంది అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలతో సహా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశపెట్టారని చెప్పారు.

pulivendula4

వారంతా మా డబ్బులు ఏమయ్యాయని నిలదీస్తారని ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్ళే పరిస్ధితి లేదన్నారు. 2027 చివరిలో జమిలి ఎన్నికలు అంటున్నారు అని దీనితో చంద్ర బాబు లో వణుకు మొదలు అయిందని కానీ మనలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నామన్నారు. మీకు నా తమ్ముడు అవినాష్‌ అందుబాటులో ఉంటాడని మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండని చెప్పారు. తప్పకుండా సాయం చేస్తారన్నారు. మీరందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను అన్నారు. చంద్రబాబు బాదుడే బాదుడులాగా పాలన సాగిస్తున్నారని, సూపర్‌ సిక్స్‌ లేదు సూపర్‌ సెవెన్‌ లేదు, అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే రైతు ధర్నా చేశామని ఈ నెల 27న కరెంట్‌ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం, జనవరి 3న విద్యార్ధుల ఫీజురీఇంబర్స్‌మెంట్‌పై వారి తరుపున మరో కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పారు. మీ అందరి సహాయ సహకారాలు కావాలన్నారు. అంతకు మునుపు
జగన్ మోహన్ రెడ్డి ని కీలక నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇడుపులపాయ లోని జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి తల్లి మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సుధీకర్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, సతీష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ బంధువులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Related Posts
YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక
YSR Congress Party కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక

YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.విశాఖ మేయర్ పదవి కోసం Read more

ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ
Discussion on budget from today in AP

అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. Read more

రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. !
VIP break darshans canceled in Tirumala tomorrow.. !

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఓ ముఖ్య విషయాన్ని తెలియజేశారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబోతున్నారు. Read more

పోసాని గోరంట్లపై చర్యలు ఉంటాయి :మంత్రి అనిత
చట్టబద్ధంగా చర్యలు కొనసాగుతాయి: వంగలపూడి అనిత

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవల పోసాని కృష్ణ మురళీ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఏపీ Read more