తమిళ సినీ ప్రపంచంలో లోకేష్ కనగరాజ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. చాలా తక్కువ సినిమాలతోనే ఈ స్టార్ డైరెక్టర్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఆయన రూపొందించిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో పెద్ద ఆశలు పెంచాయి. ఇప్పుడు ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి కూలీ సినిమా చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన మొదటి దశ షూటింగ్ చెన్నై, కర్ణాటక ప్రాంతాల్లో ముగిసింది. ఇక మిగతా షూటింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. రజనీకాంత్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగా మరిన్ని కొత్త కథలు తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.ఇక లోకేష్ కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ తన పరిధిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న బెంజ్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తుండగా, ఇది కూడా ఎల్‌సీయూలో చేరబోతున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్లు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
అంతేకాకుండా, విలన్ పాత్రకు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.మాధవన్ నటనకు మంచి గుర్తింపు పొందినప్పటికీ, ఇటీవల మాస్ పాత్రల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రలో మెరిసినట్లే, మాధవన్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అదేవిధంగా, కూలీ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటున్నారు. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను ఎలా అందుకుంటాయో చూడాలి.