hydhydraa

మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. సిబ్బంది తక్షణం అక్కడ పరిశీలనలు జరిపి, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. వెంటనే బుల్డోజర్‌తో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారు. అక్కడ “ఇది ప్రభుత్వ భూమి” అని బోర్డు ఏర్పాటు చేశారు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో కూడా హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన హద్దు గోడలను జేసీబీలతో తొలగించారు. ఖాళీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో ప్రజల నుండి ఫిర్యాదులు అధికంగా రావడం ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే హైడ్రా అధికారులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే సమాచారం అందించాలని, ఆ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Posts
తెలంగాణ లోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్?
wine shops telangana

తెలంగాణలో మద్యం ప్రియులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే దీనిపై చర్యలు Read more

నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న రెండు ఉపగ్రహాలు
Isro pslv c60 spadex mission with launch today

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పాడెక్స్‌’ ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లో Read more

తెలంగాణలో కొత్తగా 12 మున్సిపాలిటీలు
12 new municipalities in Te

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం Read more

రైతుభరోసా పరిమితి, మార్గదర్శకాలు
formers

రైతులకు తమ ప్రభుత్వం మేలుచేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ దిశగా చర్చలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా రైతు భరోసా అర్హత .. పరిమితి పైన Read more