manipur

మణిపూర్‌ ప్రజలకు సీఎం క్షమాపణలు

గత కొంతకాలంగా మణిపూర్‌లో జరుగుతున్న హింసపై ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం బీరెన్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.


‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరంగా సాగింది. గతేడాది మే 3 నుంచి నేటి వరకు రాష్ట్రంలోని పరిణామాల విషయంలో ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇళ్లను కోల్పోయారు. అందుకు నేను చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను. అయితే గత నాలుగు నెలలుగా శాంతి భద్రతల పురోగతిని చూసిన తర్వాత 2025 నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను భావిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన తప్పులను క్షమించి.. మణిపూర్‌లోని 35 తెగలు కలిసి సామరస్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు.
యావత్‌ దేశాన్ని కుదిపేసిన సంఘటన
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత మే నెలలో చెలరేగిన ఘర్షణలు యావత్‌ దేశాన్ని కలవరపరిచాయి. మైతీలకు రిజర్వేషన్ల అంశంపై కుకీలు, మైతీల మధ్య చిచ్చు రేగింది. రెండు జాతుల మధ్య వైరం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Related Posts
నేడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
Jana Sena formation meeting in Pithapuram today

అమరావతి: జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది Read more

సింగిల్ పేరెంట్ గా లైఫ్ ఎలా ఉంది..? సానియా చెప్పిన సమాధానం ఇదే..!
sania mirza son

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ గత ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల తర్వాత సానియా తన Read more

DevakiNandanaVasudeva: అభిమానుల కోలాహలం నడుమ గల్లా అశోక్ సక్సెస్ టూర్
Devaki success tour

గతవారం మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. వేటికవే సెపరేట్ జోనర్స్ లో తెరకెక్కాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు Read more

డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!
Actress Prayaga Martin Name

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్ Read more