Curfew imposed in many parts of Manipur

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇటివల జిరిబామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 11 మంది సాయుధ గ్రూపు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన అనంతరం ఇంఫాల్లోయలో పలు ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగిందని, ఇరు వర్గాలకు చెందిన సాయుధ సమూహాలు ఎదురు కాల్పులకు పాల్పడ్డాయని పోలీసులు తెలిపారు. దీంతో మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని, భద్రతా అధికారులు తెలిపారు.

కాగా, సోమవారం సాయంత్రం ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో వివిధ గ్రామాల నుండి హింసాత్మక ఘర్షణలు నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అదే సమయంలో తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఎన్కౌటర్లో మరణించినవారంతా కుకీ తెగకు చెందినవారని స్థానిక మీడియా వెల్లడించింది. కుకీల హత్యకు నిరసనగా కొండిపాంతాల్లోని ఆ తెగ మెజారిటీగా ఉండే ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 5.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. అదే సమయంలో తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించబడింది అధికారులు చెప్పారు.

Related Posts
జగన్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
MLA GV Anjaneyu who made ke

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ Read more

MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగింపు
Term of office of MLCs

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ మేరకు మండలి వారికి అధికారికంగా వీడ్కోలు పలికారు. పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో ప్రముఖులు యనమల Read more

ఢిల్లీలో బీజేపీ గెలుపు ఏపీలో ప్రభావం చూపనుందా?
ఢిల్లీలో బీజేపీ గెలుపు ఏపీలో ప్రభావం చూపనుందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 27 ఏళ్ల విరామం తర్వాత ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఎన్డీయే చేతిలో, అలాగే బీజేపీ చేతిలో Read more

హిందీ భాష వల్లే..25 భాషలు కనుమరుగు : స్టాలిన్
Because of Hindi language..25 languages ​​are disappearing: Stalin

హిందీ భాష ఓ మాస్క్ అయితే, సంస్కృతం ఓ క‌నిపించ‌ని ముఖం చెన్నై: హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు త‌న పోరాటాన్ని ఉదృతం చేసింది. ఆ భాష‌ను Read more