yanamala rama krishnudu comments on ys jagan

భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డమ‌నేది ప‌గ‌టి క‌లే: యనమల

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మరోసారి మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శులు గుప్పించారు. తల్లి, చెల్లిపై కేసులు నమోదు చేయడంతో, జగన్‌ పాతాళంలో పడిపోయారని విమర్శించారు. ఆయనతో కలిసి ఉన్న వారందరూ కూడా పాతాళంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చివరకు, జగన తన స్వంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని ఆరోపించారు.

ఇది ఆస్తుల వివాదం కాదు, ఇది రాజకీయ ఆత్మహత్య అని యనమల పేర్కొన్నారు. షర్మిలకు రూ.200 కోట్లిచ్చానని జగన చెబుతున్నా… ఐటీ, ఈడీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఈ రూ.200 కోట్ల సొమ్ము ఆయనకు ఎక్కడి నుంచి వచ్చినట్లు అడిగారు. ఈ సందర్భంలో, జగనపై యనమల ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఎలా ఉన్నాడో అని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన మళ్లీ అధికారంలోకి రాయడం అసాధ్యమని చురకలంటించారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు కూడా ఆయనపై సిద్ధంగా ఉన్నాయని, ఇవాళ కాకపోతే రేపు జగన జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు.

Related Posts
ఆప్‌కి స్వల్ప ఊరట..సీఎం అతిశీ గెలుపు
Small relief for AAP.. CM Atishi's win

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కౌంటింగ్‎లో చివరి వరకు వెనుకంజలో ఉన్న ఢిల్లీ సీఎం అతిశీ.. అనూహ్యంగా లాస్ట్ Read more

మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు
gbs cases

మహారాష్ట్రలో గిలియన్-బార్ సిండ్రోమ్ (GBS) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 183కు చేరుకుంది. ఈ వ్యాధి Read more

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Sabarimala temple to be opened today

తిరువనంతపురం: నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని మూసివేసిన పూజారులు నేడు తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం ఐదు Read more

పోలీసులపై అఘోరీమాత శాపనార్థాలు ..
nagasadhu

అఘోరీ మాత తన కారు యాక్సిడెంట్ ఘటనపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిసినప్పటికీ, తన కారు ప్రమాదానికి Read more