boy

బోరుబావిలో చిన్నారి: శ్రమిస్తున్న అధికారులు

రాజస్థాన్: డిసెంబర్ 11, పెద్దల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. నీటి కోసం పొలాల్లో బోరుబావులు గోతులు తీసి నీరు పడకపోతే మల్లి వాటిని పూడ్చి వేయాలి అని కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టిన అదే వరుస. తాజాగా రాజస్థాన్​ దౌసాలోని బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 42 గంటలకు పైగా బోరుబావిలో ఉన్న చిన్నారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బోరుబావికి కొద్ది దూరంలో పైలింగ్‌ మిషన్‌తో 150 అడుగుల వరకు గొయ్యిను తవ్వుతున్నారు.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్యన్ తన తల్లితో ఆడుకుంటుండగా ఘటన జరిగింది. అనుకోకుండా ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో ఆర్యన్ ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్​ను అధికారులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దేవేంద్ర యాదవ్ అక్కడికి చేరుకుని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.తొలుత NDRF, SDRF బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్‌ ద్వారా ఆర్యన్‌ను బయటకు తీయడానికి చాలాసార్లు ప్రయత్నించాయి. కానీ విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత పలు విధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు పైలింగ్‌ మిషన్‌తో బోరుబావికి 4 నుంచి 5 అడుగుల దూరంలో 4 అడుగుల వెడల్పుతో గొయ్యి తీస్తున్నారు అధికారులు. 150 అడుగుల తవ్వకం పూర్తయిన తర్వాత, NDRF సిబ్బంది అందులో దిగి సొరంగం తవ్వి బాలుడి వద్దకు చేరుకోనున్నారు. అలా ఆర్యన్​ను కాపాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Related Posts
ఇంటి పై కప్పు కూలి 5 గురు మృతి
ఇంటి పైకప్పు కూలి 5 గురు దుర్మరణం – పంజాబ్‌లో విషాదం!

పంజాబ్‌లోని ఓ గ్రామంలో జరిగిన భయంకర ప్రమాదం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో, అందులో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు Read more

ఎపిక్స్ (EPICS) ప్రోగ్రామ్ ద్వారా సామాజిక పరివర్తనకు మార్గం వేస్తోన్న కెఎల్‌హెచ్‌ విద్యార్థులు
KLH students paving the way

కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్శిటీ , తమ వినూత్న ఎపిక్స్ (EPICS- కమ్యూనిటీ సర్వీస్‌లో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌లు) కార్యక్రమం ద్వారా సామాజిక ప్రభావంతో విద్యాభాసాన్ని సజావుగా Read more

సాయిపల్లవి ..వార్నింగ్
saipallavi post

తనపై వస్తున్న నిరాధార రూమర్స్ పై సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. "నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. బాలీవుడ్ లో రణ్ Read more

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ‘ఇండియా కా సెలబ్రేషన్’ ప్రచారంలో విజేతల ప్రకటనతో పండుగ సంతోషాన్ని పంచుతోంది..
LG Electronics is spreading the festive cheer by announcing the winners of its India Ka Celebration campaign

హైదరాబాద్ : పండుగ ఉత్సాహాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హైదరాబాద్‌లో తన "ఇండియా కా సెలబ్రేషన్" ప్రచారంలో విజేతలను గర్వంగా ప్రకటించింది. ఈ ప్రచారంలో Read more