anil

బోరుగడ్డకు రాచమర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్

బోరుగడ్డ అనిల్ కేసులో మరో నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అనిల్ కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల అండతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. వరుసపెట్టి కేసులు నమోదు చేసి వణుకుపుట్టిస్తుంది. కేవలం ఈయనకు మాత్రమే కాదు ఈయనకు రాచమర్యాదలు చేసిన వారికీ..చేయాలనుకునేవారికి కూడా చుక్కలు చూపిస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చడం, అనంతరం రిమాండ్ కు పంపడం చేస్తున్నారు.

ఈ క్రమంలో రిమాండ్ లో ఉన్న అనిల్ కు కొంతమంది పోలీసులు రాచమర్యాదలు చేస్తుండడం పై యావత్ ప్రజలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు, ఓ రౌడీ షీటర్ కు మర్యాలు చేయడం ఏంటి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. వారం క్రితం ఓ రెస్టారెంట్ లో అనిల్ కు విందు భోజనం పెట్టిన ఘటనలో పలువురు పోలీసులను సస్పెండ్ చేయగా..తాజాగా జైల్లో మర్యాదలు చేసిన పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అనిల్కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. అనిల్కు స్టేషన్లోనే దుప్పటి, దిండు ఇవ్వడం, మేనల్లుడిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారాయి.

Related Posts
కేజ్రీవాల్ కారుపై దాడి!
కేజ్రీవాల్ కారుపై దాడి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ Read more

ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు
earthquake

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా Read more

చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: CM చంద్రబాబు
cbn 0chit

ఆంధ్రప్రదేశ్‌లోని సాయిసాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల ఆయన సచివాలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, Read more

కీలక నిజాలు బయటపెట్టిన వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి
varra ravindar

గత వైసీపీ హయాంలో సోషల్ మీడియా లో అసత్యప్రచారాలు , అసభ్యకర పోస్టులు , వీడియోలు పోస్టు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే Read more