bike accident

“గేమ్ చేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌..ఇద్దరు యువకుల మృతి

అప్పటివరకు ఎంతో హ్యాపీగా వున్న వారిద్దరూ విగతజీవులుగా మారిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చారు. ఎంతో భవిష్యత్తు వున్నవారు కనుమరుగై పోయారు. ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. దీనితో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) శనివారం రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరిగిన రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ కోసం బైక్‌పై వచ్చారు. అయితే, అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి కాకినాడ బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 9.30 గంటల సమయంలో వడిశలేరులో ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే 108 వాహనంలో పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంసభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

Related Posts
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు – ఏపీ ప్రభుత్వం
HUDCO Rs.11 thousand crore

అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నుండి రూ. 11 వేల కోట్ల నిధులు అందించేందుకు అంగీకారం లభించినట్లు Read more

ఏపీ లో మండలి నోటిఫికేషన్ జారీ
ఏపీ లో మండలి నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు త్వరలో Read more

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
chanrdrababu

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ Read more

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు
train

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు Read more