Harish Rao stakes in Anand

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి – హరీష్ రావు డిమాండ్

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. టాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ విధించడం, ఆకస్మికంగా నిబంధనలు సవరించడం వారికి అన్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసుల అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోకుండా, కుటుంబ సభ్యుల ఆందోళనలను గమనించకుండా చర్యలు తీసుకోవడం అనైతికమని పేర్కొన్నారు.

ఈ మేరకు డీజీపీ జితేందర్‌ను సస్పెన్షన్‌ను మానవతా దృక్పథంతో ఉపసంహరించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు కోసం బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
nirmala sitharaman

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ Read more

ఆస్ట్రేలియాపై ఓటమి రోహిత్ అభిప్రాయం
ఆస్ట్రేలియాపై ఓటమి రోహిత్ అభిప్రాయం

మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో 184 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ పరాజయం మానసికంగా ఎంతో కష్టంగా ఉందని Read more

నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
Srivari Teppotsavam from today

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ(మార్చి 09) రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 Read more

గాజాలో శాంతి ఏర్పడేందుకు హమాస్, ఈజిప్టు చర్చలు..
gaza 1 scaled

పాలస్తీనా మిలిటెంట్ గుంపు హమాస్ ప్రతినిధులు ఈ శనివారం కైరోకి వెళ్లి, గాజాలో జరిగే సీస్ ఫైర్(కాల్పుల విరమణ) మరియు ఖైదీ ఒప్పందం పై ఈజిప్టు అధికారులతో Read more