bujjithalli

బుజ్జితల్లి వచ్చేస్తుంది

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. దీంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.

Advertisements

ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘బుజ్జి తల్లి’ అనే పాటను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఓ చైతన్య- సాయిపల్లవి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తండేల్ రాజు బుల్లితల్లికి ప్రేమతో’ ఈ లవ్ ట్రాక్ 2024లోనే సాంగ్ ఆఫ్ ది ఇయర్​ అవ్వనుందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. తాజా అప్డేట్​తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుంది. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్​లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్​తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ ‘దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే’ అంటూ చెప్పే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాకు రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్నీ వాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Posts
త్వరలో జనసేన పార్టీలోకి మంచు మనోజ్, మౌనిక?
manchu

ఇటీవల కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మోహన్ Read more

మూడో పెళ్లి చేసుకోబోతున్న రాఖీ సావంత్
rakhi sawant

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాఖీ… ఇప్పుడు మూడో పెళ్లితో మరోసారి చర్చనీయాంశంగా Read more

అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అల్లు అరవింద్
అలా మాట్లాడకుండా ఉండాల్సింది: అల్లు అరవింద్

రామ్ చరణ్ పై అల్లు అరవింద్ వివరణ: "తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదు" సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల తన మేనళ్లుడు రామ్ Read more

Mark Shankar Health : మార్క్ శంకర్ హాస్పటల్ పిక్ వైరల్
mark shankar pic

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో పవన్ అభిమానుల్లో, కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్‌లో Read more

Advertisements
×